సూరా 3 · జుజ్ 3
Ali 'Imran · 3:37
فَتَقَبَّلَهَا رَبُّهَا بِقَبُولٍ حَسَنٍ وَأَنْبَتَهَا نَبَاتًا حَسَنًا وَكَفَّلَهَا زَكَرِيَّا ۖ كُلَّمَا دَخَلَ عَلَيْهَا زَكَرِيَّا الْمِحْرَابَ وَجَدَ عِنْدَهَا رِزْقًا ۖ قَالَ يَا مَرْيَمُ أَنَّىٰ لَكِ هَٰذَا ۖ قَالَتْ هُوَ مِنْ عِنْدِ اللَّهِ ۖ إِنَّ اللَّهَ يَرْزُقُ مَنْ يَشَاءُ بِغَيْرِ حِسَابٍ
ఆ తరువాత ఆ బాలికను, ఆమె ప్రభువు ఆదరంతో స్వీకరించి, ఆమెను ఒక మంచి స్త్రీగా పెంచాడు మరియు ఆమెను 'జకరియ్యా సంరక్షణలో ఉంచాడు. జకరియ్యా ఆమె గదికి పోయినప్పుడల్లా, ఆమె వద్ద (ఏవో కొన్ని) భోజన పదార్థాలను చూసి, ఆమెను ఇలా అడిగేవాడు: "ఓ మర్యమ్, ఇది నీ వద్దకు ఎక్కడి నుండి వచ్చింది?" ఆమె ఇలా జవాబిచ్చేది: "ఇది అల్లాహ్ వద్ద నుండి వచ్చింది." నిశ్చయంగా, అల్లాహ్ తాను కోరిన వారికి లెక్క లేనంత జీవనోపాధిని ప్రసాదిస్తాడు.
తఫ్సీర్
అల్లాహ్ దయతో ఆ సమర్పణను అంగీకరించి, ఆమెను బాగా పెంచాడు. ఆయన తన భక్తుల హృదయాలను ఆమె పట్ల శ్రద్ధ చూపేటట్లు చేసాడు మరియు ఆమెను ప్రవక్త జకరియా అలైహిస్సలాం సంరక్షణలో ఉంచాడు. ఎప్పుడైతే జకరియా ఆమె ఆరాధనా స్థలంలోనికి ప్రవేశించాడో, అక్కడ అతను తాజా ఆహారాన్ని చూశాడు. అప్పుడు అతను ఆమెను 'ఓ మర్యం (మేరీ), నీ వద్దకు ఈ ఆహారం ఎక్కడ నుండి వచ్చింది?' అని అడుగగా, ఆమె ఇలా జవాబిచ్చినది, 'ఈ ఆహారం అల్లాహ్ నుండి వచ్చింది. లెక్క లేకుండా అల్లాహ్ తనకు తోచిన వారికి సమృద్ధిగా ఇస్తాడు '.
రీడర్లో తెరవండి - పూర్తి సూరాను చదవండి