సూరా 28 · జుజ్ 20
Al-Qasas · 28:32
اسْلُكْ يَدَكَ فِي جَيْبِكَ تَخْرُجْ بَيْضَاءَ مِنْ غَيْرِ سُوءٍ وَاضْمُمْ إِلَيْكَ جَنَاحَكَ مِنَ الرَّهْبِ ۖ فَذَانِكَ بُرْهَانَانِ مِنْ رَبِّكَ إِلَىٰ فِرْعَوْنَ وَمَلَئِهِ ۚ إِنَّهُمْ كَانُوا قَوْمًا فَاسِقِينَ
నీ చేతిని నీ చంకలోకి దూర్చుకో, అది ఎలాంటి లోపం లేకుండా ప్రకాశిస్తూ బయటికి వస్తుంది. నీవు భయపడకుండా ఉండటానికి నీ చేతిని నీ ప్రక్కకు అదుముకో! ఈ రెండు, నీవు ఫిర్ఔన్ మరియు అతని నాయకులకు (చూపటానికి) నీ ప్రభువు ప్రసాదించిన నిదర్శనాలు (ఆయాత్). నిశ్చయంగా వారు చాలా దుష్టులయి పోయారు!"
తఫ్సీర్
నీవు నీ కుడి చేతిని నీ మెడ దగ్గరలో నీ చొక్క తెరవబడిన భాగములో ప్రవేశింపజేయి అది ఎటువంటి బొల్లి రోగము లేకుండా తెల్లగా బయటకు వస్తుంది. అప్పుడు మూసా దాన్ని ప్రవేశింపజేశారు అది మంచువలె తెల్లగా బయటకు వచ్చింది. మరియు నీ చేతిని నీ వైపునకు నీ భయం తగ్గటానికి అదుముకో. అప్పుడు మూసా దాన్ని తన వైపునకు అదుముకున్నారు అంతే ఆయన భయము ఆయన నుండి తొలగిపోయింది. ఈ ప్రస్తావించబడిన చేతి కర్ర,చేయి నీ ప్రభువు వద్ద నుండి ఫిర్ఔన్,అతని జాతి నాయకుల వైపునకు పంపించబడ్డ నిదర్శనాలు. నిశ్చయంగా వారు అవిశ్వాసము ద్వారా,పాపకార్యలకు పాల్పడటం ద్వారా అల్లాహ్ విధేయత నుండి తొలగిపోయిన ప్రజలు.
రీడర్‌లో తెరవండి - పూర్తి సూరాను చదవండి