సూరా 28 · జుజ్ 20
Al-Qasas · 28:29
۞ فَلَمَّا قَضَىٰ مُوسَى الْأَجَلَ وَسَارَ بِأَهْلِهِ آنَسَ مِنْ جَانِبِ الطُّورِ نَارًا قَالَ لِأَهْلِهِ امْكُثُوا إِنِّي آنَسْتُ نَارًا لَعَلِّي آتِيكُمْ مِنْهَا بِخَبَرٍ أَوْ جَذْوَةٍ مِنَ النَّارِ لَعَلَّكُمْ تَصْطَلُونَ
ఆ తరువాత మూసా తన గడువు పూర్తి చేసి, తన కుటుంబం వారిని తీసుకొని పోతుండగా, తూర్ పర్వతపు దిక్కులో ఒక మంటను చూశాడు. (అప్పుడు) తన ఇంటి వారితో అన్నాడు: "ఆగండి! నేను ఒక మంటను చూశాను, బహుశా! నేను అక్కడి నుండి ఏదైనా మంచి వార్తను తీసుకొని రావచ్చు, లేదా ఒక అగ్ని కొరవినైనా! అప్పుడు మీరు దానితో చలి కాచుకోవచ్చు."
తఫ్సీర్
ఎప్పుడైతే మూసా రెండు కాలములను పది సంవత్సరములుగా పూర్తి చేసి,తన ఇంటి వారిని తీసుకుని మద్యన్ నుండి మిసర్ కు బయలు దేరారో తూర్ పర్వత దిక్కులో ఆయన ఒక మంటను చూశారు. అప్పుడు ఆయన తన ఇంటి వారితో ఇలా పలికారు : మీరు ఆగండి, నిశ్చయంగా నేను ఒక మంటను చూశాను. బహుశా నేను దాని నుండి మీ వద్దకు ఏదైన సమాచారము తీసుకుని వస్తాను. లేదా నేను మంట నుండి మీ వద్దకు ఒక కొరివిని తీసుకుని వస్తాను మీరు దానితో మంటను వెలిగిస్తారు. బహుశా మీరు చలి నుండి వెచ్చదనాన్ని గ్రహిస్తారు.
రీడర్లో తెరవండి - పూర్తి సూరాను చదవండి