సూరా 24 · జుజ్ 18

An-Nur · 24:47

وَيَقُولُونَ آمَنَّا بِاللَّهِ وَبِالرَّسُولِ وَأَطَعْنَا ثُمَّ يَتَوَلَّىٰ فَرِيقٌ مِنْهُمْ مِنْ بَعْدِ ذَٰلِكَ ۚ وَمَا أُولَٰئِكَ بِالْمُؤْمِنِينَ

వారు (కపట విశ్వాసులు) అంటారు: "మేము అల్లాహ్ ను మరియు సందేశహరుణ్ణి విశ్వసించాము మరియు విధేయుల మయ్యాము." కాని దాని తరువాత వారిలో ఒక వర్గం వారు వెను దిరిగి పోతారు. మరియు అలాంటి వారు విశ్వసించిన వారు కారు.

తఫ్సీర్

మరియు కపటులు ఇలా పలికారు : మేము అల్లాహ్ ను విశ్వసించాము మరియు దైవ ప్రవక్తను విశ్వసించాము. మరియు అల్లాహ్ పై విధేయత చూపాము మరియు ఆయన ప్రవక్తపై విధేయత చూపాము. ఆ తరువాత వారిలో నుండి ఒక వర్గము ముఖము చాటేసింది. వారు అల్లాహ్ పై,ఆయన ప్రవక్త పై విశ్వాసము గురించి,వారి పట్ల విధేయత గురించి వాదించిన తరువాత వారు అల్లాహ్ మార్గంలో ధర్మ పోరాటం ఆదేశం విషయంలో,ఇతరవాటిలో అల్లాహ్ పై,ఆయన ప్రవక్తపై విధేయత చూపలేదు. మరియు అల్లాహ్,ఆయన ప్రవక్త పై విధేయత నుండి విముఖత చూపే వీరందరు ఒక వేళ వారు విశ్వాసపరులని వాదించినా వారు విశ్వాసపరులు కారు.

రీడర్‌లో తెరవండి - పూర్తి సూరాను చదవండి

మీ భాషలో తఫ్సీర్

అరబిక్ తఫ్సీర్లు

అనువాదం

వినండి