సూరా 24 · జుజ్ 18

An-Nur · 24:45

وَاللَّهُ خَلَقَ كُلَّ دَابَّةٍ مِنْ مَاءٍ ۖ فَمِنْهُمْ مَنْ يَمْشِي عَلَىٰ بَطْنِهِ وَمِنْهُمْ مَنْ يَمْشِي عَلَىٰ رِجْلَيْنِ وَمِنْهُمْ مَنْ يَمْشِي عَلَىٰ أَرْبَعٍ ۚ يَخْلُقُ اللَّهُ مَا يَشَاءُ ۚ إِنَّ اللَّهَ عَلَىٰ كُلِّ شَيْءٍ قَدِيرٌ

మరియు అల్లాహ్ ప్రతి ప్రాణిని నీటి నుండి సృష్టించాడు. వాటిలో కొన్ని తమ కడుపు మీద ప్రాకేవి ఉన్నాయి. మరియు వాటిలో కొన్ని రెండు కాళ్ళ మీద నడిచేవి ఉన్నాయి. మరియు వాటిలో మరికొన్ని నాలుగు (కాళ్ళ) మీద నడిచేవి ఉన్నాయి. అల్లాహ్ తాను కోరిన దానిని సృష్టిస్తాడు. నిశ్చయంగా, అల్లాహ్ ప్రతిదీ చేయగల సమర్ధుడు.

తఫ్సీర్

మరియు అల్లాహ్ జంతువుల్లోంచి భూ ఉపరితలంపై ప్రాకే ప్రతీ దాన్ని నీటి బిందువుతో సృష్టించాడు. వాటిలో నుండి తమ పొట్టపై ప్రాకుతూ నడిచే పాములు లాంటివి ఉన్నవి. మరియు వాటిలో నుండి రెండుకాళ్ళపై నడిచే మనుషులు,పక్షులు లాంటివి ఉన్నవి. మరియు వాటిలో నుండి నాలుగు కాళ్ళపై నడిచే పశువులు లాంటివి ఉన్నవి. అల్లాహ్ తాను ప్రస్తావించిన వాటిని,ప్రస్తావించని వాటిలో నుంచి తాను కోరిన వాటిని సృష్టిస్తాడు. నిశ్ఛయంగా అల్లాహ్ ప్రతీది చేసే సమర్ధుడు. ఆయనను ఏదీ అశక్తుడిని చేయదు.

రీడర్‌లో తెరవండి - పూర్తి సూరాను చదవండి

మీ భాషలో తఫ్సీర్

అరబిక్ తఫ్సీర్లు

అనువాదం

వినండి