సూరా 24 · జుజ్ 18

An-Nur · 24:2

الزَّانِيَةُ وَالزَّانِي فَاجْلِدُوا كُلَّ وَاحِدٍ مِنْهُمَا مِائَةَ جَلْدَةٍ ۖ وَلَا تَأْخُذْكُمْ بِهِمَا رَأْفَةٌ فِي دِينِ اللَّهِ إِنْ كُنْتُمْ تُؤْمِنُونَ بِاللَّهِ وَالْيَوْمِ الْآخِرِ ۖ وَلْيَشْهَدْ عَذَابَهُمَا طَائِفَةٌ مِنَ الْمُؤْمِنِينَ

వ్యభిచారిణి మరియు వ్యభిచారుడు, ఈ ఇద్దరిలో ప్రతి ఒక్కరికి నూరేసి కొరడా దెబ్బలు కొట్టండి. మరియు మీకు అల్లాహ్ యందు మరియు అంతిమ దినమునందు విశ్వాసముంటే - అల్లాహ్ విధించిన ధర్మవిషయంలో - వారిద్దరి యెడల మీకు జాలి కలుగకూడదు. మరియు వారిద్దరి శిక్షను, విశ్వాసులలో కొందరు చూడాలి.

తఫ్సీర్

వ్యభిచారకురాలు,వ్యభిచారకుడు ఇద్దరు అవివాహితులైతే వారిద్దరిలో నుండి ప్రతి ఒక్కరిని మీరు వంద కొరడా దెబ్బలు కొట్టండి. ఒక వేళ మీరు అల్లాహ్ పై,అంతిమ దినంపై విశ్వాసమును కలిగి ఉంటే వారిద్దరి విషయంలో మీరు వారిపై శిక్ష విధించకుండా ఉండటానికి లేదా వారిపై దాన్ని తేలిక చేయటానికి మీకు వారిపై జాలి గాని దయ గాని కలగకూడదు. శిక్షను విధించేటప్పుడు విశ్వాసపరుల్లోంచి ఒక వర్గం వారిద్దరి (శిక్ష) గురించి నలువైపుల వ్యాపించటానికి,వారిద్దరిని,ఇతరులను హెచ్చరించటానికి హాజరుకావాలి.

రీడర్‌లో తెరవండి - పూర్తి సూరాను చదవండి

మీ భాషలో తఫ్సీర్

అరబిక్ తఫ్సీర్లు

అనువాదం

వినండి