సూరా 2 · జుజ్ 1
Al-Baqarah · 2:44
۞ أَتَأْمُرُونَ النَّاسَ بِالْبِرِّ وَتَنْسَوْنَ أَنْفُسَكُمْ وَأَنْتُمْ تَتْلُونَ الْكِتَابَ ۚ أَفَلَا تَعْقِلُونَ
ఏమీ? మీరు ఇతరులనైతే నీతిపరులవమని ఆజ్ఞాపిస్తున్నారు, కాని, స్వయంగా మీరే దానిని అవలంబించడం మరచి పోతున్నారెందుకు? మరియు మీరయితే గ్రంథాన్ని చదువుతున్నారు కదా! అయితే మీరెందుకు మీ బుద్ధిని ఉపయోగించరు?
తఫ్సీర్
(ఇది) ఎంతటి ఘోరం:మీరు పరులకు విశ్వాసం మరియు సత్కర్మల గురించి బోధిస్తున్నారు కానీ స్వయంగా మీరు మరచిపోయి వాటిని ధిక్కరిస్తున్నారు.అంతేకాకుండా మీరు తౌరాతు గ్రంధంలో ప్రస్తావించబడిన దైవవిధేయత ధర్మఅనుసరణ మరియు ఆయన ప్రవక్తల ధృవీకరణకు సంబంధించిన ఆదేశాలను చదువుతున్నారు.మీరు (మీకు ఉన్న)బుద్ధిని ఉపయోగించుకోలేకపోతున్నారా?
రీడర్‌లో తెరవండి - పూర్తి సూరాను చదవండి