సూరా 2 · జుజ్ 1
Al-Baqarah · 2:35
وَقُلْنَا يَا آدَمُ اسْكُنْ أَنْتَ وَزَوْجُكَ الْجَنَّةَ وَكُلَا مِنْهَا رَغَدًا حَيْثُ شِئْتُمَا وَلَا تَقْرَبَا هَٰذِهِ الشَّجَرَةَ فَتَكُونَا مِنَ الظَّالِمِينَ
మరియు మేము (ఆదమ్ తో) అన్నాము: "ఓ ఆదమ్! నీవూ మరియు నీ భార్యా, ఈ స్వర్గంలో నివసించండి మరియు మీరిద్దరూ మీకు ఇష్టమైనది యథేచ్ఛగా తినండి, కానీ ఈ చెట్టు దరిదాపులకు పోకండి, అలా చేస్తే మీరిద్దరూ దుర్మార్గులలో చేరిన వారవుతారు!"
తఫ్సీర్
మరియు మేము ఆదముతో ఇలా అన్నాము: ఓ ఆదం నీవు నీ భార్య స్వర్గంలో నివసించండి మరియు మీరిరువురూ స్వర్గం యొక్క ఏ ప్రదేశం యొక్క ఫలాలను యథేచ్ఛగా తినండి.వాటిని ఆస్వాధించటంలో మీకు ఏవిధమైన విరక్తి కలుగదు.కానీ నేను మీకు నిషేధించిన ఈ చెట్టు నుంచి తినే ఉద్దేశ్యంతో దానికి దరిదాపులకు కూడా పోకండి అలా చేస్తే మీరిద్దరూ మీకు ఆజ్ఞాపించిన దానికి అవిధేయులై దుర్మార్గులలో చేరిన వారవుతారు.
రీడర్లో తెరవండి - పూర్తి సూరాను చదవండి