సూరా 2 · జుజ్ 1
Al-Baqarah · 2:33
قَالَ يَا آدَمُ أَنْبِئْهُمْ بِأَسْمَائِهِمْ ۖ فَلَمَّا أَنْبَأَهُمْ بِأَسْمَائِهِمْ قَالَ أَلَمْ أَقُلْ لَكُمْ إِنِّي أَعْلَمُ غَيْبَ السَّمَاوَاتِ وَالْأَرْضِ وَأَعْلَمُ مَا تُبْدُونَ وَمَا كُنْتُمْ تَكْتُمُونَ
ఆయన (అల్లాహ్): "ఓ ఆదమ్! వీటి (ఈ వస్తువుల) పేర్లను వీరికి తెలుపు." అని అన్నాడు. ఎపుడైతే అతను (ఆదమ్) ఆ వస్తువుల పేర్లను వారికి తెలిపాడో; ఆయన అన్నాడు: "నిశ్చయంగా, నేను మాత్రమే భూమ్యాకాశాల అగోచర విషయాలను ఎరుగుదునని మీతో చెప్పలేదా? మరియు మీరు ఏది బహిర్గతం చేస్తారో మరియు ఏది దాస్తారో కూడా నాకు బాగా తెలుసు!"
తఫ్సీర్
అప్పుడు అల్లాహ్ ఆదం(అలైహిస్సలాం)ను నీవు ఈ వస్తువుల పేర్లను తెలియజేయమని ఆదేశించాడు.మరి ఎప్పుడైతే తన ప్రభువు నేర్పినవాటిని అతను తెలియజేశాడో అప్పుడు అల్లాహ్ దైవదూతలతో ఇలా అన్నాడు: నేను భూమ్యాకాశాలలో అగోచరమైన వాటన్నింటినీ తెలిసినవాడను అని మీకు చెప్పలేదా?మరియు మీరు దాచి ఉంచే వాటిని మీరు బహిర్గతం చేసే వాటిని కూడి తెలిసినవాడను.
రీడర్లో తెరవండి - పూర్తి సూరాను చదవండి