సూరా 2 · జుజ్ 2
Al-Baqarah · 2:250
وَلَمَّا بَرَزُوا لِجَالُوتَ وَجُنُودِهِ قَالُوا رَبَّنَا أَفْرِغْ عَلَيْنَا صَبْرًا وَثَبِّتْ أَقْدَامَنَا وَانْصُرْنَا عَلَى الْقَوْمِ الْكَافِرِينَ
జాలూత్ (గోలియత్) మరియు అతని సైన్యాన్ని ఎదుర్కొనటానికి బయలు దేరి, వారు: "ఓ మా ప్రభూ! మాకు (ధైర్య) స్థైర్యాలను ప్రసాదించు, మా పాదాలను స్థిరంగా నిలపు. మరియు సత్యతిరస్కారులకు విరుద్ధంగా (పోరాడటానికి) మాకు సహాయపడు." అని ప్రార్థించారు.
తఫ్సీర్
జాలూత్తో,మరియు అతని సైన్యంతో ముఖాముఖీ అయినప్పుడు వారు అల్లాహ్ వైపు మరలి ఇలా వేడుకున్నారు: ప్రభూ మా హృదయాలకు సహనాన్ని పుష్కలంగా ప్రసాదించు,మా ముందే మా శత్రువు ఓడిపోయేంతవరకు మా కాళ్ళకు నిలకడను ఇవ్వు. నీ తోడ్పాటు,శక్తితో అవిశ్వాసులపై మాకు సహాయపడు.
రీడర్లో తెరవండి - పూర్తి సూరాను చదవండి