సూరా 2 · జుజ్ 2
Al-Baqarah · 2:224
وَلَا تَجْعَلُوا اللَّهَ عُرْضَةً لِأَيْمَانِكُمْ أَنْ تَبَرُّوا وَتَتَّقُوا وَتُصْلِحُوا بَيْنَ النَّاسِ ۗ وَاللَّهُ سَمِيعٌ عَلِيمٌ
మరియు మీరు అల్లాహ్ (పేరుతో) చేసే ప్రమాణాలు మిమ్మల్ని సన్మార్గం నుండి, దైవభీతి నుండి మరియు ప్రజలలలో శాంతి స్థాపించటం నుండి ఆటంకపరిచేవిగా కానివ్వకండి. మరియు అల్లాహ్ సర్వం వినేవాడు, సర్వజ్ఞుడు.
తఫ్సీర్
సత్కర్మలు చేయటానికి, దైవభీతిని ప్రజల మధ్య సంస్కరణను చేయటానికి మీరు అల్లాహ్ పై చేసే ప్రమాణమును బలవంతపు వాదనగా చేయకండి.కాని సత్కార్యమును వదిలి వేయటానికి ప్రమాణం చేస్తే సత్కార్యమును చేయండి.మీ ప్రమాణములకు పరిహారమును చెల్లించండి.అల్లాహ్ మీ మాటలను వింటున్నాడు,మీ కార్యాల గురించి జ్ఞానమును కలవాడు,వాటికి తొందరలోనే మీకు.ప్రతిఫలాన్ని ప్రసాదిస్తాడు.
రీడర్‌లో తెరవండి - పూర్తి సూరాను చదవండి