సూరా 2 · జుజ్ 2
Al-Baqarah · 2:174
إِنَّ الَّذِينَ يَكْتُمُونَ مَا أَنْزَلَ اللَّهُ مِنَ الْكِتَابِ وَيَشْتَرُونَ بِهِ ثَمَنًا قَلِيلًا ۙ أُولَٰئِكَ مَا يَأْكُلُونَ فِي بُطُونِهِمْ إِلَّا النَّارَ وَلَا يُكَلِّمُهُمُ اللَّهُ يَوْمَ الْقِيَامَةِ وَلَا يُزَكِّيهِمْ وَلَهُمْ عَذَابٌ أَلِيمٌ
నిశ్చయంగా, ఎవరైతే అల్లాహ్ గ్రంథంలో అవతరింపజేసిన సందేశాలను దాచి, దానికి బదులుగా అల్పలాభం పొందుతారో, అలాంటి వారు తమ కడుపులను కేవలం అగ్నితో నింపుకుంటున్నారు మరియు అల్లాహ్ పునరుత్థాన దినమున వారితో మాట్లాడడు మరియు వారిని శుద్ధపరచడు మరియు వారికి బాధాకరమైన శిక్ష ఉంటుంది.
తఫ్సీర్
నిశ్చయంగా గ్రంధంలో నుంచి అల్లాహ్ అవతరింపజేసిన సందేశాలను, వాటిలో ఉన్న విషయాలు ఏవైతే దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వ సల్లం యొక్క దైవదౌత్యాన్ని,సత్యాన్ని నిరూపించే ఆధారాలను యూదులు,క్రైస్తవులు ఏవిధంగా చేసేవారో ఆవిధంగా దాచివేస్తారో,వాటిని నాయకత్వం,మానం,ధనం లాంటి కొద్దిపాటి వాటికి బదులుగా అమ్ముకుంటారో,వాస్తవానికి వారు తమ కడుపులకి నరకాగ్ని ద్వారా శిక్షకు కారణం అయ్యే వాటిని తింటున్నారు,వారితో అల్లాహ్ ప్రళయదినాన వారు ఇష్టపడే మాటలు మాట్లాడడు,కాని వారికి చెడు అనిపించే (బాధ కలిగించే) మాటలు మాట్లాడుతాడు,వారిని పరిశుద్ధపరచడు,వారిని పొగడడు,వారి కొరకు బాధాకరమైన శిక్ష ఉన్నది.
రీడర్లో తెరవండి - పూర్తి సూరాను చదవండి