సూరా 2 · జుజ్ 2
Al-Baqarah · 2:172
يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا كُلُوا مِنْ طَيِّبَاتِ مَا رَزَقْنَاكُمْ وَاشْكُرُوا لِلَّهِ إِنْ كُنْتُمْ إِيَّاهُ تَعْبُدُونَ
ఓ విశ్వాసులారా! మీరు నిజంగానే కేవలం ఆయన (అల్లాహ్) నే ఆరాధించేవారు అయితే; మేము మీకు జీవనోపాధిగా ఇచ్చిన పరిశుద్ధమైన (ధర్మసమ్మతమైన) వస్తువులనే తినండి మరియు అల్లాహ్ కు కృతజ్ఞతలు తెలుపండి.
తఫ్సీర్
అల్లాహ్ పై విశ్వాసమును చూపి ఆయన ప్రవక్తలను అనుసరించేవారా మీ కొరకు అల్లాహ్ ప్రసాదించిన,శాస్త్రియం చేసిన హలాల్ వస్తువులనే తినండి,మీకు అల్లాహ్ ప్రసాదించిన అనుగ్రహాలపై అల్లాహ్ కు ప్రత్యక్షంగా,అంతరంగంగా కృతజ్ఞతలు తెలుపుకోండి,ఆయనపై విధేయత చూపుతూ ఆచరించడం,ఆయనకి అవిధేయత చూపటం నుండి దూరంగా ఉండటం ఆయనకు కృతజ్ఞత తెలుపుకోవటంలో నుంచే,ఒకవేళ మీరు వాస్తవానికి ఆయనొక్కడినే ఆరాధిస్తూ ఉంటే ఆయనతోపాటు వేరే వారిని సాటి కల్పించరు.
రీడర్‌లో తెరవండి - పూర్తి సూరాను చదవండి