సూరా 2 · జుజ్ 2
Al-Baqarah · 2:155
وَلَنَبْلُوَنَّكُمْ بِشَيْءٍ مِنَ الْخَوْفِ وَالْجُوعِ وَنَقْصٍ مِنَ الْأَمْوَالِ وَالْأَنْفُسِ وَالثَّمَرَاتِ ۗ وَبَشِّرِ الصَّابِرِينَ
మరియు నిశ్చయంగా మేము, మిమ్మల్ని భయప్రమాదాలకు, ఆకలి బాధలకు, ధన ప్రాణ ఫల (ఆదాయాల) నష్టానికి గురిచేసి పరీక్షిస్తాము. మరియు (ఇలాంటి పరిస్థితులలో) మనఃస్థైర్యంతో ఉండేవారికి శుభవార్తనివ్వు.
తఫ్సీర్
మరియు మేము తప్పకుండా మిమ్మల్ని రకరకాల ఆపదలకు గురి చేసి మీ శతృవుల తరుపు నుంచి భయాందోళనలకు గురి చేసి,ఆహారము తగ్గుదల ద్వారా ఆకలికి గురి చేసి,ధన సంపదలను దూరం చేయటం ద్వారా నష్టం చేసి లేదా వాటిని సంపాదించడం కష్టం చేసి,ప్రజలకు హాని కలిగించే కష్టాల కారణంగా ప్రాణ నష్టం చేసి,లేదా అల్లాహ్ మార్గంలో అమరగతిని కలిగించడం ద్వారా,నేల పండించే ఫలాలను నష్టం కలిగించి పరీక్షిస్తాము. ఓ ప్రవక్త ఈ కష్టాలపై సహనం పాటించే వారికి శుభవార్తను తెలియచేయండి వీటి ద్వారానే వారికి ఇహ పరాలలో సంతోషము ప్రాప్తిస్తుంది.
రీడర్లో తెరవండి - పూర్తి సూరాను చదవండి