సూరా 2 · జుజ్ 2

Al-Baqarah · 2:150

وَمِنْ حَيْثُ خَرَجْتَ فَوَلِّ وَجْهَكَ شَطْرَ الْمَسْجِدِ الْحَرَامِ ۚ وَحَيْثُ مَا كُنْتُمْ فَوَلُّوا وُجُوهَكُمْ شَطْرَهُ لِئَلَّا يَكُونَ لِلنَّاسِ عَلَيْكُمْ حُجَّةٌ إِلَّا الَّذِينَ ظَلَمُوا مِنْهُمْ فَلَا تَخْشَوْهُمْ وَاخْشَوْنِي وَلِأُتِمَّ نِعْمَتِي عَلَيْكُمْ وَلَعَلَّكُمْ تَهْتَدُونَ

మరియు నీవు ఎక్కడికి బయలుదేరినా సరే! నీ ముఖాన్ని (నమాజ్ లో) మస్జిద్ అల్ హరామ్ వైపునకే త్రిప్పుకో. మరియు మీరెక్కడున్నా సరే, మీ ముఖాలను దాని వైపునకే త్రిప్పుకోండి. దీని వల్ల మీకు వ్యతిరేకంగా వాదించటానికి ప్రజలకు అవకాశం దొరుకదు. కాని వారిలో దుర్మార్గులైన వారు (ఎలాంటి పరిస్థితులలోనూ ఊరుకోరు). అందుకని వారికి భయపడకండి. నాకే భయపడండి! మరియు ఈ విధంగా నేను మీపై నా అనుగ్రహాన్ని పూర్తి చేయటానికి, మరియు బహుశా, ఈ విధంగానైనా మీరు మార్గదర్శకత్వం పొందవచ్చు!

తఫ్సీర్

ఓ ప్రవక్త మీరు ఏ ప్రాంతము నుంచి బయలుదేరినా నమాజు చేయదలచుకుంటే మస్జిదుల్ హరాం వైపునకు అభిముఖమవ్వండి. ఓ విశ్వాసపరులారా మీరు ఏ ప్రాంతములో ఉన్నా నమాజు చేయదలచుకుంటే మీ ముఖములను దాని వైపునకే మరల్చుకోండి;జనులు మీకు వ్యతిరేకంగా ఎటువంటి వాదనలు చేయకుండా ఉండటానికి,కాని వారిలోంచి కొందరు దుర్మార్గులుంటారు,వారు తమ వ్యతిరేకత పైనే ఉంటారు,మీకు వ్యతిరేకంగా బలహీనమైన వాదనలు వాదిస్తూనే ఉంటారు,అయితే మీరు వారికి భయపడకండి,ఒక్కడైన మీ ప్రభువుకి ఆయన ఆదేశాలను పాటిస్తూ,ఆయన వారించిన వాటికి దూరంగా ఉంటూ భయపడండి,నిశ్చయంగా అల్లాహ్ జాతుల్లోంచి మిమ్మల్ని వేరుపరచి మీపై తన అనుగ్రహమును పూర్తి చేయటానికి కాబావైపు అభిముఖమవ్వటమును నిర్ణయించాడు,ప్రజల గొప్ప ఖిబ్లా వైపు మీకు మార్గదర్శకానికి.

రీడర్‌లో తెరవండి - పూర్తి సూరాను చదవండి

మీ భాషలో తఫ్సీర్

అరబిక్ తఫ్సీర్లు

అనువాదం

వినండి