సూరా 2 · జుజ్ 2
Al-Baqarah · 2:146
الَّذِينَ آتَيْنَاهُمُ الْكِتَابَ يَعْرِفُونَهُ كَمَا يَعْرِفُونَ أَبْنَاءَهُمْ ۖ وَإِنَّ فَرِيقًا مِنْهُمْ لَيَكْتُمُونَ الْحَقَّ وَهُمْ يَعْلَمُونَ
మేము గ్రంథాన్ని ప్రసాదించిన వారు తమ కుమారులను ఏ విధంగా గుర్తిస్తారో ఇతనిని (ముహమ్మద్ ను) కూడా ఆ విధంగా గుర్తిస్తారు. మరియు వాస్తవానికి వారిలోని ఒక వర్గం వారు తెలిసి కూడా సత్యాన్ని దాస్తున్నారు.
తఫ్సీర్
గ్రంధం ఇవ్వబడిన యూదులు,క్రైస్తవుల పండితులకు ఖిబ్లా మార్పు ఆదేశం వారి వద్ద ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క దైవ దౌత్య సూచనల్లోంచి అని తెలుసు,తమ పిల్లలను ఇతర పిల్లల్లోంచి ఎలా గుర్తించి వేరు చేసుకుంటారో (అలా తెలసు) ,దానితోపాటు వారిలోని ఒక వర్గం ఆయన తీసుకుని వచ్చిన వాస్తవాన్ని తమ అసూయ వలన దాచి వేస్తున్నారు,అది వాస్తవమని తెలిసి కూడా వారు ఇలా చేస్తున్నారు.
రీడర్‌లో తెరవండి - పూర్తి సూరాను చదవండి