సూరా 2 · జుజ్ 1

Al-Baqarah · 2:127

وَإِذْ يَرْفَعُ إِبْرَاهِيمُ الْقَوَاعِدَ مِنَ الْبَيْتِ وَإِسْمَاعِيلُ رَبَّنَا تَقَبَّلْ مِنَّا ۖ إِنَّكَ أَنْتَ السَّمِيعُ الْعَلِيمُ

మరియు (జ్ఞాపకం చేసుకోండి) ఇబ్రాహీమ్ మరియు ఇస్మాయీల్ ఈ గృహపు (కఅబహ్) పునాదులను ఎత్తేటపుడు (ఈ విధంగా ప్రార్థించారు): "ఓ మా ప్రభూ! మా ఈ సేవను స్వీకరించు. నిశ్చయంగా, నీవు మాత్రమే సర్వం వినేవాడవు, సర్వజ్ఞుడవు."

తఫ్సీర్

మరియు ఓ ప్రవక్త మీరు జ్ఞాపకం చేసుకోండి ఇబ్రాహీం మరియు ఇస్మాయీల్ అలైహిమస్సలామ్ కాబా గృహపు పునాదులను ఎత్తేటపుడు వారిరువురు ఎంతో అణుకువతో, వినమ్రతతో ఈ విధంగా పలకసాగారు : ఓ మా ప్రభూ నీవు మా ఆచరణలను (మరియు అందులో నుంచి ఈ గ్రహనిర్మాణమును) స్వీకరించు.నిశ్చయంగా మా ప్రార్దనలను స్వీకరించేవాడివి,మా సంకల్పాలను,మా ఆచరణలను తెలిసినవాడివి నీవే.

రీడర్‌లో తెరవండి - పూర్తి సూరాను చదవండి

మీ భాషలో తఫ్సీర్

అరబిక్ తఫ్సీర్లు

అనువాదం

వినండి