సూరా 2 · జుజ్ 1

Al-Baqarah · 2:117

بَدِيعُ السَّمَاوَاتِ وَالْأَرْضِ ۖ وَإِذَا قَضَىٰ أَمْرًا فَإِنَّمَا يَقُولُ لَهُ كُنْ فَيَكُونُ

ఆయనే ఆకాశాలనూ మరియు భూమినీ ఏ నమూనా లేకుండా ఆరంభించిన (సృష్టించిన) వాడు. మరియు ఆయన ఏదైనా చేయాలని నిర్ణయించుకున్నప్పుడు దానిని కేవలం: "అయిపో!" అని ఆజ్ఞాపిస్తాడు. అంతే అది అయిపోతుంది.

తఫ్సీర్

మరియు పరిశుద్ధుడైన అల్లాహ్ ఆకాశములను మరియు భూమిని మరియు ఆ రెండింటిలో ఉన్న వాటిని పూర్వ నమూనా లేకుండా సృష్టించినవాడు. మరియు ఆయన ఏదైన విషయమును అంచనా వేసుకుని దాన్ని నిర్ణయించుకున్నప్పుడు ఆ విషయము కొరకు ఇలా పలుకుతాడు : నీవు అయిపో (కున్) అప్పుడు అల్లాహ్ ఎలా అవ్వాలని కోరుకున్నాడో అలా అయిపోతుంది. ఆయన ఆదేశమును మరియు ఆయన నిర్ణయమును మరల్చేవాడు ఎవడూ ఉండడు.

రీడర్‌లో తెరవండి - పూర్తి సూరాను చదవండి

మీ భాషలో తఫ్సీర్

అరబిక్ తఫ్సీర్లు

అనువాదం

వినండి