సూరా 2 · జుజ్ 1
Al-Baqarah · 2:113
وَقَالَتِ الْيَهُودُ لَيْسَتِ النَّصَارَىٰ عَلَىٰ شَيْءٍ وَقَالَتِ النَّصَارَىٰ لَيْسَتِ الْيَهُودُ عَلَىٰ شَيْءٍ وَهُمْ يَتْلُونَ الْكِتَابَ ۗ كَذَٰلِكَ قَالَ الَّذِينَ لَا يَعْلَمُونَ مِثْلَ قَوْلِهِمْ ۚ فَاللَّهُ يَحْكُمُ بَيْنَهُمْ يَوْمَ الْقِيَامَةِ فِيمَا كَانُوا فِيهِ يَخْتَلِفُونَ
మరియు యూదులు: "క్రైస్తవుల వద్ద (సత్యధర్మమనేది) ఏదీ లేదు." అని అంటారు. మరియు క్రైస్తవులు: "యూదుల వద్ద (సత్యధర్మమనేది) ఏదీ లేదు." అని అంటారు. మరియు వారందరూ చదివేదు దివ్యగ్రంథమే. ఇలాగే (దివ్యగ్రంథ) జ్ఞానం లేనివారు (బహుదైవారాధకులు) కూడా ఇదే విధంగా పలుకు తుంటారు. కావున వారందరిలో ఉన్న అభిప్రాయభేదాలను గురించి, అల్లాహ్ పునరుత్థాన దినమున వారి మధ్య తీర్పు చేస్తాడు.
తఫ్సీర్
మరియు యూదులు ఇలా పలికారు : క్రైస్తవులు సరైన ధర్మంపై లేరు. మరియు క్రైస్తవులు ఇలా పలికారు : యూదులు సరైన ధర్మంపై లేరు. వాస్తవానికి వారందరు తమపై అల్లాహ్ అవతరింపజేసిన గ్రంధాలను మరియు వాటిలో దైవ ప్రవక్తలందరిని ఎటువంటి బేధభావం లేకుండా విశ్వసించాలని ఉన్న ఆదేశమును చదువుతున్నారు. వారి ఈ చర్యలో జ్ఞానం లేని ముష్రికుల మాటను పోలి ఉన్నారు. ఎప్పుడైతే వారు ప్రవక్తలందరిని మరియు వారిపై అవతరింపబడిన గ్రంధములను తిరస్కరించారో. ఇందు వలనే అల్లాహ్ విభేదించే వారి మధ్య ప్రళయదినమున తీర్పునిస్తాడు తన దాసులకు ఇచ్చిన న్యాయపూరితమైన తీర్పును ఈవిధంగా ఇస్తాడు: మహోన్నతుడైన అల్లాహ్ అవతరింపజేసిన వాటన్నింటిని విశ్వసించటంలోనే సాఫల్యం ఉన్నది.
రీడర్లో తెరవండి - పూర్తి సూరాను చదవండి