సూరా 2 · జుజ్ 1

Al-Baqarah · 2:105

مَا يَوَدُّ الَّذِينَ كَفَرُوا مِنْ أَهْلِ الْكِتَابِ وَلَا الْمُشْرِكِينَ أَنْ يُنَزَّلَ عَلَيْكُمْ مِنْ خَيْرٍ مِنْ رَبِّكُمْ ۗ وَاللَّهُ يَخْتَصُّ بِرَحْمَتِهِ مَنْ يَشَاءُ ۚ وَاللَّهُ ذُو الْفَضْلِ الْعَظِيمِ

సత్యతిరస్కారులైన గ్రంథప్రజలకు గానీ మరియు బహుదైవారాధకులకు (ముష్రికులకు) గానీ, మీ ప్రభువు నుండి మీకు ఏదైనా మేలు అవతరించడం ఎంత మాత్రం ఇష్టం లేదు. కానీ అల్లాహ్ తాను కోరిన వారినే తన కరుణకు ప్రత్యేకించు కుంటాడు. మరియు అల్లాహ్ అనుగ్రహించటంలో సర్వోత్తముడు.

తఫ్సీర్

అవిశ్వాసపరులు వారు యూదులైనా లేదా ముష్రికులైనా మీ ప్రభువు వద్ద నుండి ఏదైన మేలు అది కొద్దిగా అయినా లేదా ఎక్కువ అయిన మీపై అవతరించటంను ఇష్టపడరు. మరియు అల్లాహ్ తన దాసుల్లోంచి తాను తలచుకున్న వారికి తన కారుణ్యమును దైవదౌత్య రూపంలో,దైవవాణి రూపంలో,విశ్వాసం రూపంలో ప్రత్యేకిస్తాడు. మరియు అల్లాహ్ గొప్ప అనుగ్రహం కలవాడు. సృష్టి రాసుల్లోంచి ఎవరికైన ఏదైన మేలు కలిగితే ఆయన వద్ద నుండే కలుగును. దైవ ప్రవక్తను పంపించటం మరియు గ్రంధమును అవతరింపజేయటం ఆయన అనుగ్రహములో నుంచే.

రీడర్‌లో తెరవండి - పూర్తి సూరాను చదవండి

మీ భాషలో తఫ్సీర్

అరబిక్ తఫ్సీర్లు

అనువాదం

వినండి