సూరా 17 · జుజ్ 15
Al-Isra · 17:99
۞ أَوَلَمْ يَرَوْا أَنَّ اللَّهَ الَّذِي خَلَقَ السَّمَاوَاتِ وَالْأَرْضَ قَادِرٌ عَلَىٰ أَنْ يَخْلُقَ مِثْلَهُمْ وَجَعَلَ لَهُمْ أَجَلًا لَا رَيْبَ فِيهِ فَأَبَى الظَّالِمُونَ إِلَّا كُفُورًا
ఏమీ? వారు చూడటం లేదా (ఎరుగరా)? నిశ్చయంగా, అల్లాహ్ యే ఆకాశాలనూ మరియు భూమినీ సృష్టించిన వాడనీ మరియు వారి వంటి వారినీ సృష్టించగల సమర్ధుడనీ మరియు ఆయనే వారి కొరకు ఒక నిర్ణీత సమయాన్ని నియమించాడనీ, దానిని (ఆ సమయాన్ని) గురించి ఎలాంటి సందేహం లేదనీ; అయినా ఈ దుర్మార్గులు మొండిగా సత్యాన్ని తిరస్కరించటానికే పూనుకున్నారు.
తఫ్సీర్
ఏమీ మరణాంతరం లేపబడటమును తిరస్కరించే వీరందరికి భూమ్యాకాశములను గొప్పగా సృష్టించిన వాడు వారి లాంటివారిని సృష్టించటంపై సమర్ధుడని తెలియదా ?. అయితే ఎవరైతే గొప్పవైన వాటిని సృష్టించటంపై సామర్ధ్యం కలవాడు దాని కన్నఅల్పమైన వాటిని సృష్టించటంపై సామర్ధ్యం కలవాడు. ఇహలోకంలో అల్లాహ్ వారి కొరకు ఒక నిర్ణీత సమయమును ఎందులోనైతే వారి జీవితం ముగుస్తుందో తయారు చేశాడు. మరియు వారిని మరణాంతరం లేపటం కొరకు ఎటువంటి సందేహం లేని ఒక గడువును తయారు చేశాడు. ముష్రికులు మరణాంతరం లేపబడటం యొక్క ఆధారాలు బహిర్గతమైనా కూడా,దాని ఆధారాలు స్పష్టమైనా కూడా మరణాంతరము లేపబడటమును తిరస్కరించకుండా ఉండరు.
రీడర్‌లో తెరవండి - పూర్తి సూరాను చదవండి