సూరా 17 · జుజ్ 15
Al-Isra · 17:94
وَمَا مَنَعَ النَّاسَ أَنْ يُؤْمِنُوا إِذْ جَاءَهُمُ الْهُدَىٰ إِلَّا أَنْ قَالُوا أَبَعَثَ اللَّهُ بَشَرًا رَسُولًا
మరియు ప్రజల ముందుకు మార్గదర్శకత్వం వచ్చినపుడు, దానిని విశ్వసించకుండా వారిని ఆపిందేమిటి? వారు (మూఢ విశ్వాసంలో మునిగి): "ఏమీ? అల్లాహ్ మానవుణ్ణి తన సందేశహరునిగా పంపాడా?" అని పలకడం తప్ప!
తఫ్సీర్
అవిశ్వాసపరులను అల్లాహ్ పై,ఆయన ప్రవక్తపై విశ్వాసమును కనబరచటం నుండి,ప్రవక్త తీసుకుని వచ్చిన దానిపై అమలు చేయటం నుండి ఆపినది కేవలం వారు తిరస్కార వైఖరితో "ఏమీ అల్లాహ్ మా వద్దకు మనషుల్లోండి ఒక ప్రవక్తను పంపించాడా ?" అని పలికిన వేళ ప్రవక్త మానవుల రకంలో నుండి కావటమును వారి తిరస్కారము మాత్రమే .
రీడర్లో తెరవండి - పూర్తి సూరాను చదవండి