సూరా 17 · జుజ్ 15
Al-Isra · 17:88
قُلْ لَئِنِ اجْتَمَعَتِ الْإِنْسُ وَالْجِنُّ عَلَىٰ أَنْ يَأْتُوا بِمِثْلِ هَٰذَا الْقُرْآنِ لَا يَأْتُونَ بِمِثْلِهِ وَلَوْ كَانَ بَعْضُهُمْ لِبَعْضٍ ظَهِيرًا
ఇలా అను: "ఒకవేళ మానవులు మరియు జిన్నాతులు అందరూ కలిసి, ఈ ఖుర్ఆన్ వంటి దానిని కల్పించి తీసుకు రావటానికి ప్రయత్నించినా - వారు ఒకరి కొకరు తోడ్పడినప్పటికీ - ఇటువంటి దానిని కల్పించి తేలేరు."
తఫ్సీర్
ఓ ప్రవక్తా మీరు ఇలా పలకండి : ఒక వేళ మానవులు, జిన్నులు అందరు కలిసి మీపై అవతరింపబడినదైన ఈ ఖుర్ఆన్ దాని వాగ్ధాటిలో,దాని మంచి వ్యవస్థీకరణలో,దాని స్పష్టతలో పోలిటువంటి దానిని తీసుకుని రాదలచుకుంటే ఖచ్చితంగా వారు ఎన్నటికి తీసుకుని రాలేరు. ఒక వేళ వారు ఒకరికొకరు సహాయసహకారాలు చేసుకున్నా కూడా.
రీడర్‌లో తెరవండి - పూర్తి సూరాను చదవండి