సూరా 17 · జుజ్ 15

Al-Isra · 17:78

أَقِمِ الصَّلَاةَ لِدُلُوكِ الشَّمْسِ إِلَىٰ غَسَقِ اللَّيْلِ وَقُرْآنَ الْفَجْرِ ۖ إِنَّ قُرْآنَ الْفَجْرِ كَانَ مَشْهُودًا

మధ్యాహ్నం సూర్యుడు వాలినప్పటి నుండి, రాత్రి అయి చీకటి పడే వరకూ నమాజ్ లను సలుపు. మరియు ప్రాతఃకాలంలో (నమాజ్ లో) ఖుర్ఆన్ పఠించు. నిశ్చయంగా ప్రాతఃకాల ఖుర్ఆన్ పఠనం (దేవదూతల ద్వారా) వీక్షింప బడుతుంది.

తఫ్సీర్

మీరు నమాజును దాని పరిపూర్ణ పద్దతిలో దాని వేళల్లో సూర్యుడు ఆకాశము మధ్య నుండి వాలినప్పటి నుండి - ఇందులో జొహర్,అసర్ నమాజులు ఉన్నాయి - రాత్రి చీకటి వరకు - ఇందులో మగ్రిబ్,ఇషా నమాజులు ఉన్నవి - నెలకోల్పండి. మరియు మీరు ఫజర్ నమాజును నెలకోల్పండి,అందులో ఖిరాఅత్ (ఖుర్ఆన్ పారాయణము) ను సుదీర్ఘంగా చేయండి. ఫజర్ నమాజు వేళ రాత్రి దైవ దూతలు,పగటి దైవ దూతలు హాజరవుతారు.

రీడర్‌లో తెరవండి - పూర్తి సూరాను చదవండి

మీ భాషలో తఫ్సీర్

అరబిక్ తఫ్సీర్లు

అనువాదం

వినండి