సూరా 17 · జుజ్ 15

Al-Isra · 17:69

أَمْ أَمِنْتُمْ أَنْ يُعِيدَكُمْ فِيهِ تَارَةً أُخْرَىٰ فَيُرْسِلَ عَلَيْكُمْ قَاصِفًا مِنَ الرِّيحِ فَيُغْرِقَكُمْ بِمَا كَفَرْتُمْ ۙ ثُمَّ لَا تَجِدُوا لَكُمْ عَلَيْنَا بِهِ تَبِيعًا

లేదా! మరొకసారి ఆయన మిమ్మల్ని సముద్రంలోకి తీసుకొని పోయి - మీ కృతఘ్నతకు ఫలితంగా - మీ మీద తీవ్రమైన తుఫాను గాలిని పంపి, మిమ్మల్ని ముంచి వేయకుండా సురక్షితంగా ఉండనివ్వగలడని భావిస్తున్నారా? అప్పుడు మాకు విరుద్ధంగా సహాయపడే వారినెవ్వరినీ మీరు పొందలేరు. మరియు వాస్తవానికి మేము ఆదమ్ సంతతికి గౌరవము నొసంగాము. మరియు వారికి నేల మీదనూ, సముద్రం లోనూ, ప్రయాణం కొరకు వాహనాలను ప్రసాదించాము. మరియు మేము వారికి పరిశుద్ధమైన వస్తువులను జీవనోపాధిగా సమకూర్చాము. మరియు మేము సృష్టించిన ఎన్నో ప్రాణులపై వారికి ప్రత్యేక ప్రాధాన్యత నిచ్చాము.

తఫ్సీర్

లేదా అల్లాహ్ మిమ్మల్ని మొదటి సారి రక్షించి మీపై చేసిన అనుగ్రహమునకు మీరు కృతఘ్నులవటం వలన మిమ్మల్ని రెండవ సారి సముద్రం వద్దకు తీసుకుని వెళ్ళి మీపై తీవ్రమైన గాలిని వీపింపజేసి మిమ్మల్ని ముంచివేసి ఆ తరువాత మేము మీకు చేసిన దాని నుండి సహాయంగా మమ్మల్ని కోరే వాడినెవరినీ మీరు పొందకపోవటం నుండి నిశ్చింతగా ఉన్నారా ?.

రీడర్‌లో తెరవండి - పూర్తి సూరాను చదవండి

మీ భాషలో తఫ్సీర్

అరబిక్ తఫ్సీర్లు

అనువాదం

వినండి