సూరా 17 · జుజ్ 15
Al-Isra · 17:39
ذَٰلِكَ مِمَّا أَوْحَىٰ إِلَيْكَ رَبُّكَ مِنَ الْحِكْمَةِ ۗ وَلَا تَجْعَلْ مَعَ اللَّهِ إِلَٰهًا آخَرَ فَتُلْقَىٰ فِي جَهَنَّمَ مَلُومًا مَدْحُورًا
ఇవి వివేకంతో నిండి వున్న విషయాలు. వాటిని నీ ప్రభువు నీకు దివ్యజ్ఞానం (వహీ) ద్వారా తెలియజేశాడు. మరియు అల్లాహ్ తో పాటు మరొకరిని ఆరాధ్య దైవంగా చేసుకోకు. అలా చేస్తే అవమానానికి గురి అయి, బహిష్కరించబడి నరకంలో త్రోయబడతావు.
తఫ్సీర్
మేము నీకు స్పష్టపరచిన ఈ ఆజ్ఞలు,వారింపులు,ఆదేశాలు వేటినైతే నీ ప్రభువు నీకు దివ్య జ్ఞానం ద్వారా తెలియపరచాడో. ఓ మానవుడా నీవు అల్లాహ్ తోపాటు వేరొక ఆరాధ్య దైవమును తయారు చేసుకోకు. అలా చేస్తే నీవు ప్రళయదినాన నీ మనస్సు,ప్రజలు నిన్ను అపనిందపాలు చేసిన స్థితిలో,ప్రతీ మేలు నుండి గెంటివేయబడిన స్థితిలో పడవేయబడుతావు.
రీడర్‌లో తెరవండి - పూర్తి సూరాను చదవండి