సూరా 17 · జుజ్ 15
Al-Isra · 17:31
وَلَا تَقْتُلُوا أَوْلَادَكُمْ خَشْيَةَ إِمْلَاقٍ ۖ نَحْنُ نَرْزُقُهُمْ وَإِيَّاكُمْ ۚ إِنَّ قَتْلَهُمْ كَانَ خِطْئًا كَبِيرًا
మరియు పేదరికానికి భయపడి మీరు మీ సంతానాన్ని చంపకండి. మేమే వారికి మరియు మీకు కూడా జీవనోపాధిని సమకూర్చేవారము. నిశ్చయంగా, వారిని చంపటం గొప్ప నేరం.
తఫ్సీర్
మరియు మీరు మీ సంతానమును వారిపై ఖర్ఛు చేస్తే భవిష్యత్తులో పేదరికం కలుగుతుందన్నభయంతో హతమార్చకండి. మేము వారిని ఆహారోపాధిని ప్రసాధించి పోషిస్తాము,మిమ్మల్ని ఆహారోపాధిని ప్రసాధించి పోషిస్తాము. ఒక వేళ వారిది ఏ పాపం లేకపోతే, వారిని హతమార్చటాన్ని అనివార్యం చేసే ఏ కారణం లేకపోతే నిశ్చయంగా వారిని హతమార్చటం మహా పాపం అవుతుంది.
రీడర్‌లో తెరవండి - పూర్తి సూరాను చదవండి