సూరా 17 · జుజ్ 15

Al-Isra · 17:27

إِنَّ الْمُبَذِّرِينَ كَانُوا إِخْوَانَ الشَّيَاطِينِ ۖ وَكَانَ الشَّيْطَانُ لِرَبِّهِ كَفُورًا

నిశ్చయంగా, వ్యర్థమైన ఖర్చులు చేసేవారు షైతానుల సోదరులు. మరియు షైతాన్ తన ప్రభువు పట్ల కృతఘ్నుడైన వాడు.

తఫ్సీర్

నిశ్చయంగా తమ సంపదలను పాపకార్యాల్లో ఖర్చు చేసేవారు,దుబారాగా ఖర్చు చేసేవారు షైతాను సోదరులు. వారు దుబారాగా,వృధాగా ఖర్చు చేయటం గురించి ఆదేశిస్తే వీరు వారిని అనుసరిస్తున్నారు. వాస్తవానికి షైతాను తన ప్రభువు పట్ల కృతఘ్నుడు. అతడు కేవలం పాపము ఉన్న దానినే ఆచరిస్తాడు. తన ప్రభువుకు ఆగ్రహమును కలిగించే వాటిని మాత్రమే ఆదేశిస్తాడు.

రీడర్‌లో తెరవండి - పూర్తి సూరాను చదవండి

మీ భాషలో తఫ్సీర్

అరబిక్ తఫ్సీర్లు

అనువాదం

వినండి