సూరా 17 · జుజ్ 15

Al-Isra · 17:18

مَنْ كَانَ يُرِيدُ الْعَاجِلَةَ عَجَّلْنَا لَهُ فِيهَا مَا نَشَاءُ لِمَنْ نُرِيدُ ثُمَّ جَعَلْنَا لَهُ جَهَنَّمَ يَصْلَاهَا مَذْمُومًا مَدْحُورًا

ఎవడు (ఇహలోక) తాత్కాలిక సుఖాలు కోరుకుంటాడో - మేము కోరిన వానికి - దానిలో మాకు ఇష్టం వచ్చినంత, ఒసంగుతాము. తరువాత అతని కొరకు నరకాన్ని నియమిస్తాము, దానిలో అతడు అవమానంతో బహిష్కరించ బడినవాడై దహింపబడతాడు.

తఫ్సీర్

ఎవరైతే ప్రాపంచిక కార్యాల ద్వారా ఇహలోకమును కోరుకుని,పరలోకము పై దాని కొరకు ఏమీ చేయకుండా విశ్వసించడో అతని కొరకు మేము ఇందులో అతను కోరినది కాకుండా మేము కోరిన అనుగ్రహాలను తొందరగా ప్రసాదిస్తాము. ఆ తరువాత మేము అతని కొరకు నరకమును నియమిస్తాము. అతడు అందులో ప్రళయదినాన దాని వేడిని కళ్లముందట చూస్తూ, తాను ఇహలోకమును ఎంచుకుని పరలోకమును వదలటంపై అవమానముతో,అల్లాహ్ కారుణ్యము నుండి బహిష్కరించబడి ప్రవేశిస్తాడు.

రీడర్‌లో తెరవండి - పూర్తి సూరాను చదవండి

మీ భాషలో తఫ్సీర్

అరబిక్ తఫ్సీర్లు

అనువాదం

వినండి