సూరా 17 · జుజ్ 15
Al-Isra · 17:15
مَنِ اهْتَدَىٰ فَإِنَّمَا يَهْتَدِي لِنَفْسِهِ ۖ وَمَنْ ضَلَّ فَإِنَّمَا يَضِلُّ عَلَيْهَا ۚ وَلَا تَزِرُ وَازِرَةٌ وِزْرَ أُخْرَىٰ ۗ وَمَا كُنَّا مُعَذِّبِينَ حَتَّىٰ نَبْعَثَ رَسُولًا
ఎవడు సన్మార్గాన్ని అవలంబిస్తాడో, అతడు నిశ్చయంగా, తన మేలుకే సన్మార్గాన్ని అవలంబిస్తాడు. మరియు ఎవడు మార్గభ్రష్టుడవుతాడో, అతడు నిశ్చయంగా, తన నష్టానికే మార్గభ్రష్టుడవుతాడు. మరియు బరువు మోసే వాడెవ్వడూ మరొకని బరువును మోయడు. మరియు మేము ఒక ప్రవక్తను పంప నంత వరకు (ప్రజలకు) శిక్ష విధించేవారము కాము.
తఫ్సీర్
ఎవరైతే విశ్వాసము వైపునకు మార్గం పొందుతారో అతనికి మార్గం పొందినందుకు ప్రతిఫలం ఉంటుంది. ఎవరైతే అపమార్గం పొందుతారో అతని అపమార్గము పొందినందుకు శిక్ష అతనిపైనే పడుతుంది. ఏ ప్రాణి వేరే ప్రాణి పాపమును మోయదు. మరియు ఏ జాతినీ వారి వద్దకు మేము ప్రవక్తలను పంపి వారికి వ్యతిరేకంగా ఆధారం నిలబెట్టనంతవరకు శిక్షించేవారము కాము.
రీడర్లో తెరవండి - పూర్తి సూరాను చదవండి