సూరా 17 · జుజ్ 15

Al-Isra · 17:110

قُلِ ادْعُوا اللَّهَ أَوِ ادْعُوا الرَّحْمَٰنَ ۖ أَيًّا مَا تَدْعُوا فَلَهُ الْأَسْمَاءُ الْحُسْنَىٰ ۚ وَلَا تَجْهَرْ بِصَلَاتِكَ وَلَا تُخَافِتْ بِهَا وَابْتَغِ بَيْنَ ذَٰلِكَ سَبِيلًا

వారితో అను: "మీరు ఆయనను, అల్లాహ్! అని పిలవండీ, లేదా అనంత కరుణా మయుడు (అర్రహ్మాన్) ! అని పిలువండీ, మీరు ఆయనను ఏ పేరుతోనైనా పిలవండీ, ఆయనకున్న పేర్లన్నీ అత్యుత్తమమైనవే! నీ నమాజ్ లో నీవు చాలా గట్టిగా గానీ, చాలా మెల్లగా గానీ పఠించక, వాటి మధ్య మార్గాన్ని అవలంబించు."

తఫ్సీర్

ఓ ప్రవక్తా దుఆలో మీ మాటలైన యా అల్లాహ్,యా రహ్మాన్ ను విభేదించిన వారితో ఇలా పలుకు : అల్లాహ్,అర్రహ్మాన్ పరిశుద్ధుడైన ఆయన నామములు. అయితే మీరు వాటిలో నుండి దేని ద్వారా నైన లేదా అవి కాకుండా ఆయన నామములలో నుండి వేరే వాటి ద్వారా ఆయనను పిలవండి. పరిశుద్ధుడైన ఆయన కొరకు మంచి నామములు కలవు. ఈ రెండూ వాటిలో నుంచే. అయితే మీరు ఆ రెండిటి ద్వారా లేదా ఆయన మంచి నామములలో నుండి వేరే వాటి ద్వారా ఆయనను పిలవండి. మరియు నీవు నీ నమాజులో ఖుర్ఆన్ పరాయణమును ముష్రికులు వినేటట్లుగా బిగ్గరగా చేయకు మరియు విశ్వాసపరులు దానిని విననట్లుగా మెల్లగా చేయకు. ఆ రెండింటి మద్య మార్గమును అవలింబించు.

రీడర్‌లో తెరవండి - పూర్తి సూరాను చదవండి

మీ భాషలో తఫ్సీర్

అరబిక్ తఫ్సీర్లు

అనువాదం

వినండి