సూరా 17 · జుజ్ 15

Al-Isra · 17:107

قُلْ آمِنُوا بِهِ أَوْ لَا تُؤْمِنُوا ۚ إِنَّ الَّذِينَ أُوتُوا الْعِلْمَ مِنْ قَبْلِهِ إِذَا يُتْلَىٰ عَلَيْهِمْ يَخِرُّونَ لِلْأَذْقَانِ سُجَّدًا

వారితో అను: "మీరు దీనిని (ఈ ఖుర్ఆన్ ను) నమ్మినా నమ్మకపోయినా; నిశ్చయంగా, ఇది వరకు జ్ఞానమొసంగపడిన వారికి దీనిని వినిపించినప్పుడు, వారు తమ ముఖాల మీద పడి సాష్టాంగం (సజ్దా) చేస్తారు."

తఫ్సీర్

ఓ ప్రవక్తా మీరు వారితో అనండి : మీరు ఆయనపై విశ్వాసమును కనబరచండి. మీ విశ్వాసము ఆయనకు ఏమీ అధికం చేయదు లేదా మీరు ఆయనను విశ్వసించకపోయినా (ఏమీ అధికం చేయదు). మీ అవిశ్వాసం ఆయనది ఏమీ తరిగించదు. నిశ్చయంగా ఎవరైతే పూర్వ దివ్య గ్రంధాలను చదివి,దైవ వాణి,దైవ దౌత్యమును గుర్తించారో వారిపై ఖుర్ఆన్ చదివి వినిపించబడినప్పుడు వారు అల్లాహ్ కు కృతజ్ఞతలు తెలుపుతూ సాష్టాంగపడుతూ తమ ముఖములపై బొర్లా పడిపోతారు.

రీడర్‌లో తెరవండి - పూర్తి సూరాను చదవండి

మీ భాషలో తఫ్సీర్

అరబిక్ తఫ్సీర్లు

అనువాదం

వినండి