సూరా 17 · జుజ్ 15

Al-Isra · 17:102

قَالَ لَقَدْ عَلِمْتَ مَا أَنْزَلَ هَٰؤُلَاءِ إِلَّا رَبُّ السَّمَاوَاتِ وَالْأَرْضِ بَصَائِرَ وَإِنِّي لَأَظُنُّكَ يَا فِرْعَوْنُ مَثْبُورًا

(మూసా) అన్నాడు: "నీకు బాగా తెలుసు, జ్ఞానవృద్ధి కలుగజేసే వాటిని (సూచనలను) భూమ్యాకాశాల ప్రభువు తప్ప మరెవ్వరూ అవతరింపజేయలేరని! ఓ ఫిర్ఔన్, నీవు నిశ్చయంగా నశింపనున్నావని నేను భావిస్తున్నాను!"

తఫ్సీర్

మూసా అలైహిస్సలాం అతని మాటలను ఖండిస్తూ ఇలా పలికారు : ఓ పిర్ఔన్ భూమ్యాకాశముల ప్రభువైన అల్లాహ్ మాత్రమే ఈ మహిమలను అవతరింపజేశాడని నీకు ఖచ్చితంగా తెలుసు. ఆయన వాటిని తన సామర్ధ్యమునకు,తన ప్రవక్త నిజాయితీకి ఆధారాలుగా అవతరింపజేశాడు. కాని నీవు తిరస్కరించావు. ఓ ఫిర్ఔన్ నీవు వినాశనమునకు గురై నష్టపోతావని నిశ్చయంగా నాకు బాగా తెలుసు.

రీడర్‌లో తెరవండి - పూర్తి సూరాను చదవండి

మీ భాషలో తఫ్సీర్

అరబిక్ తఫ్సీర్లు

అనువాదం

వినండి