సూరా 16 · జుజ్ 14

An-Nahl · 16:97

مَنْ عَمِلَ صَالِحًا مِنْ ذَكَرٍ أَوْ أُنْثَىٰ وَهُوَ مُؤْمِنٌ فَلَنُحْيِيَنَّهُ حَيَاةً طَيِّبَةً ۖ وَلَنَجْزِيَنَّهُمْ أَجْرَهُمْ بِأَحْسَنِ مَا كَانُوا يَعْمَلُونَ

ఏ పురుషుడు గానీ, లేక స్త్రీ గానీ విశ్వాసులై, సత్కార్యాలు చేస్తే, అలాంటి వారిని మేము తప్పక (ఇహలోకంలో) మంచి జీవితం గడిపేలా చేస్తాము. మరియు వారికి (పరలోకంలో) వారు చేసిన సత్కార్యాలకు ఉత్తమ ప్రతిఫలం తప్పక ప్రసాదిస్తాము.

తఫ్సీర్

పురుషుడు గాని స్త్రీ గాని ఎవరైనా అల్లాహ్ పై విశ్వాసమును కనబరచి ధర్మానికి అనుగుణంగా ఏదైన సత్కార్యము చేస్తే మేము తప్పకుండా అతనికి ఇహలోకములో అల్లాహ్ తీర్పుపై సంతృప్తి,ఉన్నదానిపై సంతోషము,విధేయత కార్యాలను చేసే సౌభాగ్యము ద్వారా మంచి జివితాన్ని తప్పకుండా ప్రసాధిస్తాము. మరియు ఇహలోకములో వారు చేసిన సత్కార్యములకన్న మంచిగా పరలోకములో వారి ప్రతిఫలాన్ని మేము తప్పకుండా ప్రసాధిస్తాము.

రీడర్‌లో తెరవండి - పూర్తి సూరాను చదవండి

మీ భాషలో తఫ్సీర్

అరబిక్ తఫ్సీర్లు

అనువాదం

వినండి