సూరా 16 · జుజ్ 14
An-Nahl · 16:78
وَاللَّهُ أَخْرَجَكُمْ مِنْ بُطُونِ أُمَّهَاتِكُمْ لَا تَعْلَمُونَ شَيْئًا وَجَعَلَ لَكُمُ السَّمْعَ وَالْأَبْصَارَ وَالْأَفْئِدَةَ ۙ لَعَلَّكُمْ تَشْكُرُونَ
మరియు అల్లాహ్, మిమ్మల్ని మీ తల్లుల గర్భాల నుండి, బయటికి తీశాడు (పుట్టించాడు) అప్పుడు మీకేమీ తెలియదు. మరియు మీకు వినికిడినీ, దృష్టినీ మరియు హృదయాలను ప్రసాదించాడు. బహుశా మీరు కృతజ్ఞులై ఉంటారని.
తఫ్సీర్
ఓ ప్రజలారా అల్లాహ్ మిమ్మల్ని మీ తల్లుల గర్భాల నుండి గర్భ కాలము ముగిసిన తరువాత చంటి పిల్లలుగా తీశాడు. అప్పుడు మీకేమి తెలియదు. మరియు ఆయన మీరు వినటానికి వినికిడిని,చూడటానికి చూపును,అర్ధం చేసుకోవటానికి హృదయములను తయారు చేశాడు. వాటిలో నుండి ఆయన మీపై అనుగ్రహించిన వాటిపై మీరు ఆయనకు కృతజ్ఞతలు తెలుపుకుంటారని ఆశిస్తూ .
రీడర్లో తెరవండి - పూర్తి సూరాను చదవండి