సూరా 16 · జుజ్ 14
An-Nahl · 16:74
فَلَا تَضْرِبُوا لِلَّهِ الْأَمْثَالَ ۚ إِنَّ اللَّهَ يَعْلَمُ وَأَنْتُمْ لَا تَعْلَمُونَ
కావున అల్లాహ్ కు పోలికలు కల్పించకండి. నిశ్చయంగా, అల్లాహ్ కు అంతా తెలుసు మరియు మీకేమీ తెలియదు.
తఫ్సీర్
అయితే ఓ ప్రజలారా ఎటువంటి లాభం చేకూర్చలేని,ఎటువంటి నష్టం కలిగించలేని ఈ విగ్రహాలను అల్లాహ్ తో పోల్చకండి.ఆరాధనలో ఆయనతోపాటు మీరు సాటి కల్పించటానికి అల్లాహ్ కి పోలినవాడు ఎవడూ లేడు. నిశ్చయంగా అల్లాహ్ కొరకు గల ఘనమైన,సంపూర్ణమైన లక్షణాలు ఏమిటో అల్లాహ్ కి తెలుసు. అవి మీకు తెలియవు. అందుకే మీరు ఆయనతోపాటు సాటి కల్పించటంలో,ఆయనకు పోలిన విధంగా మీ విగ్రహాలను అర్ధించటంలో పడిపోతున్నారు.
రీడర్‌లో తెరవండి - పూర్తి సూరాను చదవండి