సూరా 16 · జుజ్ 14

An-Nahl · 16:7

وَتَحْمِلُ أَثْقَالَكُمْ إِلَىٰ بَلَدٍ لَمْ تَكُونُوا بَالِغِيهِ إِلَّا بِشِقِّ الْأَنْفُسِ ۚ إِنَّ رَبَّكُمْ لَرَءُوفٌ رَحِيمٌ

మరియు అవి మీ బరువును మోసుకొని - మీరు ఎంతో శ్రమపడనిదే చేరుకోలేని ప్రాంతాలకు - తీసుకుపోతాయి. నిశ్చంయగా, మీ ప్రభువు మహా కనికరుడు, అపార కరుణా ప్రదాత.

తఫ్సీర్

మేము మీ కొరకు సృష్టించిన ఈ పశువులు మీరు ఎంతో శ్రమపడనిదే చేరుకోలేని ప్రాంతాలకు మీ ప్రయాణముల్లో మీ బరువైన సామగ్రిని మోస్తాయి. ఓ ప్రజలారా నిశ్చయంగా మీ ప్రభువు ఈ పశువులను మీ ఆదీనంలో చేసి ఎంతో కరుణించాడు,కనికరించాడు.

రీడర్‌లో తెరవండి - పూర్తి సూరాను చదవండి

మీ భాషలో తఫ్సీర్

అరబిక్ తఫ్సీర్లు

అనువాదం

వినండి