సూరా 16 · జుజ్ 14

An-Nahl · 16:59

يَتَوَارَىٰ مِنَ الْقَوْمِ مِنْ سُوءِ مَا بُشِّرَ بِهِ ۚ أَيُمْسِكُهُ عَلَىٰ هُونٍ أَمْ يَدُسُّهُ فِي التُّرَابِ ۗ أَلَا سَاءَ مَا يَحْكُمُونَ

తనకు ఇవ్వబడిన శుభవార్తను (అతడు) దుర్వార్తగా భావించి, తన జాతి వారి నుండి దాక్కుంటూ తిరుగుతాడు. అవమానాన్ని భరించి దానిని (ఆ బాలికను) ఉంచుకోవాలా? లేక, దానిని మట్టిలో పూడ్చి వేయాలా? అని ఆలోచిస్తాడు. చూడండి! వారి నిర్ణయం ఎంత దారుణమైనదో!

తఫ్సీర్

ఆడ సంతానము జన్మించినదని అతనికి ఇవ్వబడిన వార్తను దుర్వార్తగా భావించి తన జాతి వారి నుండి అతడు నక్కి నక్కి దాక్కొని తిరుగుతుంటాడు. అతని అంతరంగము అతనితో ఇలా అంటుంది : అవమానముతో,పరాభవముతో కూడిన ఈ ఆడ బిడ్డను అట్టిపెట్టుకోవాలా లేదా ఆమెను మట్టిలో పూడ్చి జీవ సమాధి చేయాలా ?.ముష్రికులు తీసుకునే నిర్ణయం ఎప్పుడైతే వారి మనసులకి నచ్చదో వాటిని తమ ప్రభువు కొరకు నిర్ణయిస్తారు. అది ఎంతో చెడ్డదైనది.

రీడర్‌లో తెరవండి - పూర్తి సూరాను చదవండి

మీ భాషలో తఫ్సీర్

అరబిక్ తఫ్సీర్లు

అనువాదం

వినండి