సూరా 16 · జుజ్ 14
An-Nahl · 16:5
وَالْأَنْعَامَ خَلَقَهَا ۗ لَكُمْ فِيهَا دِفْءٌ وَمَنَافِعُ وَمِنْهَا تَأْكُلُونَ
మరియు ఆయన పశువులను సృష్టించాడు. వాటిలో మీ కొరకు వెచ్చని దుస్తులు మరియు అనేక లాభాలు కూడా ఉన్నాయి. మరియు వాటిలో నుండి (కొన్నిటి మాంసం) మీరు తింటారు.
తఫ్సీర్
ఓ ప్రజలారా ఆయన పశువుల్లోంచి ఒంటెలను,ఆవులను,గొర్రెలను మీ ప్రయోజనముల కొరకు సృష్టించాడు. ఈ ప్రయోజనాల్లోంచి వాటి ఉన్ని,వాటి జుట్టు ద్వారా వెచ్చదనాన్ని పొందటం,వాటి పాలల్లో,వాటి చర్మాల్లో,వాటి వీపుల్లో వేరే ప్రయోజనాలు ఉన్నవి. మరియు మీరు వాటి నుండే తింటున్నారు.
రీడర్లో తెరవండి - పూర్తి సూరాను చదవండి