సూరా 16 · జుజ్ 14

An-Nahl · 16:38

وَأَقْسَمُوا بِاللَّهِ جَهْدَ أَيْمَانِهِمْ ۙ لَا يَبْعَثُ اللَّهُ مَنْ يَمُوتُ ۚ بَلَىٰ وَعْدًا عَلَيْهِ حَقًّا وَلَٰكِنَّ أَكْثَرَ النَّاسِ لَا يَعْلَمُونَ

మరియు వారు అల్లాహ్ పేరుతో దృఢమైన శపథం చేసి ఇలా అంటారు: "మరణించిన వానిని అల్లాహ్ తిరిగి బ్రతికించి లేపడు!" ఎందుకు లేపడు! ఆయన చేసిన వాగ్దానం సత్యం! అయినా చాలా మంది ప్రజలకు ఇది తెలియదు (కాని అది జరిగి తీరుతుంది);

తఫ్సీర్

మరణాంతర జీవితమును తిరస్కరించే వీరందరు తమ ప్రమాణాల్లో అతిశయోక్తం చేస్తూ వాటిలో శ్రమిస్తూ అల్లాహ్ మరణించేవారిని మరల లేపడని దృఢమైన ప్రమాణాలు చేశారు .దానిపై వారికి ఎటువంటి ఆధారం లేదు. ఎందుకు కాదు అల్లాహ్ తొందరలోనే మరణించే ప్రతీ వ్యక్తిని మరల లేపుతాడు. దానిపై వాగ్ధానము సత్యమైనది.కానీ చాలామందికి అల్లాహ్ మృతులను మరలా లేపుతాడన్న విషయం తెలియదు. అప్పుడే వారు మరణాంతర జీవితాన్ని తిరస్కరిస్తున్నారు.

రీడర్‌లో తెరవండి - పూర్తి సూరాను చదవండి

మీ భాషలో తఫ్సీర్

అరబిక్ తఫ్సీర్లు

అనువాదం

వినండి