సూరా 16 · జుజ్ 14

An-Nahl · 16:32

الَّذِينَ تَتَوَفَّاهُمُ الْمَلَائِكَةُ طَيِّبِينَ ۙ يَقُولُونَ سَلَامٌ عَلَيْكُمُ ادْخُلُوا الْجَنَّةَ بِمَا كُنْتُمْ تَعْمَلُونَ

ఎవరైతే, పరిశుద్ధులుగా ఉండగా దైవదూతలు వారి ప్రాణాలు తీస్తారో, వారితో: "మీకు శాంతి కలుగు గాక (సలాం) ! మీరు చేసిన మంచిపనులకు ప్రతిఫలంగా స్వర్గంలో ప్రవేశించండి!" అని అంటారు.

తఫ్సీర్

దైవదూతల్లోంచి మరణ దూత,అతని సహాయకులు ఎవరి ఆత్మలనైతే వారి హృదయములు అవిశ్వాసము నుండి పరిశుద్ధముగా ఉన్నస్థతిలో తీస్తారో , దైవ దూతలు వారిని ఉద్దేశించి తమ మాటల్లో ఇలా పలుకుతారు : మీపై శాంతి కలుగుగాక. మీరు ప్రతీ ఆపద నుండి సురక్షితంగా ఉన్నారు. మీరు ఇహలోకములో ఆచరించే సరైన విశ్వాసము,సత్కర్మకు బదులుగా స్వర్గంలో ప్రవేశించండి.

రీడర్‌లో తెరవండి - పూర్తి సూరాను చదవండి

మీ భాషలో తఫ్సీర్

అరబిక్ తఫ్సీర్లు

అనువాదం

వినండి