సూరా 16 · జుజ్ 14

An-Nahl · 16:27

ثُمَّ يَوْمَ الْقِيَامَةِ يُخْزِيهِمْ وَيَقُولُ أَيْنَ شُرَكَائِيَ الَّذِينَ كُنْتُمْ تُشَاقُّونَ فِيهِمْ ۚ قَالَ الَّذِينَ أُوتُوا الْعِلْمَ إِنَّ الْخِزْيَ الْيَوْمَ وَالسُّوءَ عَلَى الْكَافِرِينَ

తరువాత పునరుత్థాన దినమున ఆయన వారిని అవమానపరుస్తాడు మరియు వారిని అడుగుతాడు: "మీరు నాకు సాటి కల్పించిన వారు - ఎవరిని గురించి అయితే మీరు (విశ్వాసులతో) వాదులాడేవారో - ఇప్పుడు ఎక్కడున్నారు?" జ్ఞానం ప్రసాదించబడిన వారు అంటారు: "నిశ్చయంగా, ఈ రోజు అవమానం మరియు దుర్దశ సత్యతిరస్కారుల కొరకే!"

తఫ్సీర్

ఆ తరువాత ప్రళయదినమున అల్లాహ్ వారిని శిక్ష ద్వారా అవమానపరుస్తాడు. దాని ద్వారా వారిని నీచపరుస్తాడు. మరియు వారితో మీరు నాతోపాటు ఆరాధనలో సాటికల్పించే భాగస్వాములు ఎక్కడ ఉన్నారు. వారి మూలంగా మీరు నా ప్రవక్తలతో,విశ్వాసపరులతో శతృత్వం చేసేవారు ? అని పలుకుతాడు. దైవ పండితులు ఇలా అంటారు : నిశ్చయంగా అవమానము,శిక్ష ప్రళయదినాన అవిశ్వాసపరులపై వచ్చిపడుతుంది.

రీడర్‌లో తెరవండి - పూర్తి సూరాను చదవండి

మీ భాషలో తఫ్సీర్

అరబిక్ తఫ్సీర్లు

అనువాదం

వినండి