సూరా 16 · జుజ్ 14

An-Nahl · 16:15

وَأَلْقَىٰ فِي الْأَرْضِ رَوَاسِيَ أَنْ تَمِيدَ بِكُمْ وَأَنْهَارًا وَسُبُلًا لَعَلَّكُمْ تَهْتَدُونَ

మరియు భూమి మీతో పాటు చలించకుండా ఉండటానికి, ఆయన దానిలో స్థిరమైన పర్వతాలను నాటాడు. మరియు అందులో నదులను ప్రవహింపజేశాడు. మరియు రహదారులను నిర్మించాడు. బహుశా మీరు మార్గం పొందుతారని!

తఫ్సీర్

మరియు ఆయన భూమిలో అది మిమ్మల్ని తీసుకుని చలించకుండా,ప్రకంపించకుండా ఉండటానికి దాన్ని స్థిరంగా ఉంచే పర్వతాలను నాటాడు. మరియు అందులో నదులను మీరు వాటి నుండి నీళ్ళు త్రాగటానికి,మీ జంతువులకు,మీ పంటలకు నీరు పట్టటానికి ప్రవహింపజేశాడు. మరియు అందులో మార్గాలను మీరు వాటిలో నడవటానికి తీశాడు. అయితే మీరు దారి తప్పకుండా మీ గమ్య స్థానాలకు చేరుకుంటారు.

రీడర్‌లో తెరవండి - పూర్తి సూరాను చదవండి

మీ భాషలో తఫ్సీర్

అరబిక్ తఫ్సీర్లు

అనువాదం

వినండి