సూరా 16 · జుజ్ 14

An-Nahl · 16:127

وَاصْبِرْ وَمَا صَبْرُكَ إِلَّا بِاللَّهِ ۚ وَلَا تَحْزَنْ عَلَيْهِمْ وَلَا تَكُ فِي ضَيْقٍ مِمَّا يَمْكُرُونَ

(ఓ ముహమ్మద్!) నీవు సహనం వహించు మరియు నీకు సహనమిచ్చేవాడు కేవలం అల్లాహ్ మాత్రమే. మరియు వారిని గురించి దుఃఖపడకు మరియు వారు పన్నే కుట్రలకు నీవు వ్యాకుల పడకు.

తఫ్సీర్

ఓ ప్రవక్తా మీరు వారి వలన మీకు కలిగిన బాధలపై సహనం చూపండి. సహనం కొరకు మీకు అనుగ్రహం అల్లాహ్ అనుగ్రహం ద్వారా మాత్రమే కలుగును. అవిశ్వాసపరులు మీ నుండి విముఖత చూపటంపై మీరు దుఃఖపడకండి. వారు చేసే కుట్రల,కుతంత్రాల వలన మీ మనస్సు వ్యాకులత చెందకూడదు.

రీడర్‌లో తెరవండి - పూర్తి సూరాను చదవండి

మీ భాషలో తఫ్సీర్

అరబిక్ తఫ్సీర్లు

అనువాదం

వినండి