సూరా 16 · జుజ్ 14

An-Nahl · 16:115

إِنَّمَا حَرَّمَ عَلَيْكُمُ الْمَيْتَةَ وَالدَّمَ وَلَحْمَ الْخِنْزِيرِ وَمَا أُهِلَّ لِغَيْرِ اللَّهِ بِهِ ۖ فَمَنِ اضْطُرَّ غَيْرَ بَاغٍ وَلَا عَادٍ فَإِنَّ اللَّهَ غَفُورٌ رَحِيمٌ

నిశ్చయంగా, ఆయన మీ కొరకు (దానంతట అది) చచ్చినది (పశువు/పక్షి) రక్తం, పందిమాంసం, అల్లాహ్ తప్ప ఇతరుల కొరకు (ఇతరుల పేర) జిబహ్ చేయబడినది (పశువు/పక్షి మాంసాన్ని) నిషేధించి ఉన్నాడు. కాని ఎవడైనా (అల్లాహ్) నియమాలను ఉల్లంఘించే ఉద్దేశంతో కాక, (ఆకలికి) తాళలేక, గత్యంతరం లేని పరిస్థితిలో (తింటే); నిశ్చయంగా, అల్లాహ్ క్షమాశీలుడు, అపార కరుణా ప్రదాత.

తఫ్సీర్

తినేవాటిలో నుండి హలాల్ చేయవలసినది హలాల్ చేయకుండానే చనిపోయినది,ప్రవహించే రక్తము,పంది దాని పూర్తి భాగములు,జిబాహ్ చేసే వ్యక్తి అల్లాహేతరుల కొరకు జిబాహ్ చేసిన జంతువు అల్లాహ్ మీపై నిషేధించాడు.ఈ నిషేధము ఎంపిక చేసుకునే స్థితిలో మాత్రమే. కాని ఎవరికైన ప్రస్తావించబడిన వాటిని తినాల్సిన అవసరం ఏర్పడి గత్యంతరం లేనప్పుడు వాటిలో నుండి నిషేధించబడిన విషయంలో ఇష్టం లేకుండా.అవసరము కన్న మితిమీరకుండా తినటంలో అతనిపై ఎటువంటి దోషం లేదు.నిశ్చయంగా అల్లాహ్ తిన్న దానిపై అతనికి మన్నించేవాడును,అత్యవసర పరిస్థితిలో అతనికి దాని అనుమతిచ్చినప్పుడు అతనిపై కనికరించేవాడును.

రీడర్‌లో తెరవండి - పూర్తి సూరాను చదవండి

మీ భాషలో తఫ్సీర్

అరబిక్ తఫ్సీర్లు

అనువాదం

వినండి