సూరా 16 · జుజ్ 14

An-Nahl · 16:101

وَإِذَا بَدَّلْنَا آيَةً مَكَانَ آيَةٍ ۙ وَاللَّهُ أَعْلَمُ بِمَا يُنَزِّلُ قَالُوا إِنَّمَا أَنْتَ مُفْتَرٍ ۚ بَلْ أَكْثَرُهُمْ لَا يَعْلَمُونَ

మరియు మేము ఒక సందేశాన్ని (ఆయత్ ను) మార్చి దాని స్థానంలో మరొక సందేశాన్ని అవతరింపజేసినప్పుడు; తాను దేన్ని ఎప్పుడు అవతరింపజేశాడో అల్లాహ్ కు బాగా తెలుసు. (అయినా) వారు (సత్యతిరస్కారులు) ఇలా అంటారు: "నిశ్చయంగా నీవే (ఓ ముహమ్మద్!) దీనిని కల్పించేవాడవు." అసలు వారిలో చాలా మంది (యథార్థం) తెలుసుకోలేరు.

తఫ్సీర్

మరియు మేము ఖుర్ఆన్ లో ఏదైన ఆయతు ఆదేశమును రద్దుపరచి దానికి బదులుగా వేరే ఆయతును తీసుకుని వచ్చినప్పుడు - ఖుర్ఆన్ లో రద్దుపరచబడిన వాటి గురించి అల్లాహ్ కి బాగా తెలుసు - వారు అంటారు : ఓ ముహమ్మద్ నీవు కేవలం అల్లాహ్ కి వ్యతిరేకంగా కల్పించుకుంటున్నావు,అబధ్ధం పలుకుతున్నావు. కానీ రద్దుపరచటం అన్నది దైవ సంపూర్ణ వివేకం వలన అవుతుందన్న విషయం చాలామందికి తెలియదు.

రీడర్‌లో తెరవండి - పూర్తి సూరాను చదవండి

మీ భాషలో తఫ్సీర్

అరబిక్ తఫ్సీర్లు

అనువాదం

వినండి