సూరా 14 · జుజ్ 13
Ibrahim · 14:50
سَرَابِيلُهُمْ مِنْ قَطِرَانٍ وَتَغْشَىٰ وُجُوهَهُمُ النَّارُ
వారి వస్త్రాలు తారు (నల్ల జిడ్డు ద్రవం)తో చేయబడి ఉంటాయి మరియు అగ్ని జ్వాలలు వారి ముఖాలను క్రమ్ముకొని ఉంటాయి -
తఫ్సీర్
ఓ ప్రవక్తా మీరు చూస్తారు ఆ రోజు భూమి వేరే భూమిగా మార్చబడుతుంది మరియు ఆకాశములు మార్చబడుతాయి.అవిశ్వాసపరులు,ముష్రికులు (బహుదైవారాధకులు) ఒకరినొకరు గొలుసుల్లో బంధించబడుతారు.వారి చేతులు,కాళ్ళు గొలుసులతో వారి మెడల వైపు కట్టబడుతాయి.వారు తొడిగే వస్త్రాలు తారుతో తయారు చేయబడి ఉంటాయి (మరియు అది చాలా మండే స్వభావం కల పదార్ధం).మరియు అగ్ని వారి నల్లటి ముఖములపై క్రమ్ముకుని ఉంటుంది.
రీడర్‌లో తెరవండి - పూర్తి సూరాను చదవండి