సూరా 14 · జుజ్ 13

Ibrahim · 14:48

يَوْمَ تُبَدَّلُ الْأَرْضُ غَيْرَ الْأَرْضِ وَالسَّمَاوَاتُ ۖ وَبَرَزُوا لِلَّهِ الْوَاحِدِ الْقَهَّارِ

ఈ భూమి మరొక భూమిగా మరియు ఆకాశాలు (వేరే ఆకాశాలుగా) మారే రోజు; ఆ అద్వితీయుడు, ప్రబలుడు అయిన అల్లాహ్ ముందు అందరూ హాజరు చేయబడతారు.

తఫ్సీర్

ఈ ప్రతీకారము అవిశ్వాసపరులకి ప్రళయదినం స్థాపతమయ్యే రోజు కలుగుతుంది.ఆ రోజు ఈ భూమి తెల్లటి,స్వచ్ఛమైన మరొక భూమిగా మార్చబడుతుంది. మరియు ఆకాశాలు వేరే ఆకాశాలుగా మార్చబడుతాయి. మరియు తన రాజరికంలో,తన మహోన్నత్యంలో ఒకే ఒక్కడైన,ఆధిక్యతను చూపేవాడు తనపై ఎవరు ఆధిక్యతను చూపని వాడు,ఓడించే వాడు,తనను ఎవరు ఓడించని వాడైన అల్లాహ్ ముందు నిలబడడానికి తమ శరీరములతో,తమ కర్మలతో తమ సమాదుల నుండి ప్రజలు బయటకు వస్తారు.

రీడర్‌లో తెరవండి - పూర్తి సూరాను చదవండి

మీ భాషలో తఫ్సీర్

అరబిక్ తఫ్సీర్లు

అనువాదం

వినండి