సూరా 14 · జుజ్ 13

Ibrahim · 14:45

وَسَكَنْتُمْ فِي مَسَاكِنِ الَّذِينَ ظَلَمُوا أَنْفُسَهُمْ وَتَبَيَّنَ لَكُمْ كَيْفَ فَعَلْنَا بِهِمْ وَضَرَبْنَا لَكُمُ الْأَمْثَالَ

"మరియు తమకు తాము అన్యాయం చేసుకున్న వారి స్థలాలలో మీరు నివసించారు. మరియు వారితో ఎలా వ్యవహరించామో మీకు బాగా తెలుసు. మరియు మేము మీకు ఎన్నో ఉపమానాలు కూడా ఇచ్చాము."

తఫ్సీర్

మరియు మీకన్నా మునుపు అల్లాహ్ పట్ల అవిశ్వాసమును కనబరచి తమపై దుర్మార్గమునకు పాల్పడిన పూర్వ జాతులైన హూద్ జాతి,సాలిహ్ జాతి లాంటి వారి నివాసముల్లో మీరు నివాసమున్నారు. మేము వారిపై కలిగించిన వినాశనము మీకు స్పష్టమైనది. మరియు మేము మీరు హితోపదేశం గ్రహించటానికి అల్లాహ్ గ్రంధములో మీకు ఉపమానములను తెలియపరచాము. కాని మీరు వాటి ద్వారా హితోపదేశం గ్రహించలేదు.

రీడర్‌లో తెరవండి - పూర్తి సూరాను చదవండి

మీ భాషలో తఫ్సీర్

అరబిక్ తఫ్సీర్లు

అనువాదం

వినండి