సూరా 13 · జుజ్ 13
Ar-Ra'd · 13:18
لِلَّذِينَ اسْتَجَابُوا لِرَبِّهِمُ الْحُسْنَىٰ ۚ وَالَّذِينَ لَمْ يَسْتَجِيبُوا لَهُ لَوْ أَنَّ لَهُمْ مَا فِي الْأَرْضِ جَمِيعًا وَمِثْلَهُ مَعَهُ لَافْتَدَوْا بِهِ ۚ أُولَٰئِكَ لَهُمْ سُوءُ الْحِسَابِ وَمَأْوَاهُمْ جَهَنَّمُ ۖ وَبِئْسَ الْمِهَادُ
తమ ప్రభువు సందేశాన్ని స్వీకరించిన వారికి మంచి ప్రతిఫలం ఉంటుంది. మరియు ఆయన సందేశాన్ని స్వీకరించని వారి దగ్గర భూమిలో ఉన్నదంతా, మరియు దానితో పాటు దానికి సమానంగా ఉన్నా, వారు అదంతా పరిహారంగా ఇవ్వదలచుకున్నా (అది స్వీకరించబడదు). అలాంటి వారి లెక్క దారుణంగా ఉంటుంది. మరియు వారి ఆశ్రయం నరకమే. మరియు అది ఎంతో దుర్భరమైన విరామ స్థలము.
తఫ్సీర్
ఆ విశ్వాసపరుల కొరకు ఎవరైతే తమ ప్రభువు తన ఏక దైవత్వం కొరకు మరియు తనపై విధేయత చూపటానికి వారిని పిలిచినప్పుడు ప్రతిస్పందించారో వారి కొరకు మంచి ప్రతిఫలం అది స్వర్గము కలదు.మరియు ఆ అవిశ్వాసపరులు ఎవరైతే అతని ఏకత్వం వైపు మరియు అతని విధేయత వైపు ఇవ్వబడిన పిలుపును స్వీకరించలేదో వారు ఒక వేళ వారి కొరకు భూమిలో ఉన్న సంపదంతటినీ మరియు దానికి సమానంగా వారి కొరకు ఉన్న దాన్ని దానితో కలిపి తమ కొరకు శిక్షకి పరిహారంగా వాటన్నింటిని ఖర్చు చేసినా (అది స్వీకరించబడదు).వారందరు ఆయన పిలుపునకు ప్రతిస్పందించ లేదు వారి పాపమలన్నింటికి వారు లెక్కతీసుకోబడుతారు.వారు శరణు తీసుకునే నివాస స్థలం నరకము.అగ్ని అయిన వారి పడక మరియు వారి నివాస స్థలం చెడ్డది.
రీడర్‌లో తెరవండి - పూర్తి సూరాను చదవండి